పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ’జల్సా’ సినిమా విడుదలై నెల రోజులు దాటింది. నిర్మాత అల్లు అరవింద్ ప్రకారం రెండువారాల్లో ఆ సినిమాకు రికార్డు స్థాయిలో 32 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత అందుకు భిన్నంగా ఆ సినిమా వసూళ్లు అనూహ్య రీతిలో దిగజారుతూ వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఏ భారీ సినిమాకూ ఇవ్వని రీతిలో ముందస్తు భారీ ప్రచారాన్ని ఇవ్వడం వల్లే, అత్యధిక థియేటర్లల్లో విడుదల చేయడం వల్లే తొలి రెండు వారాల్లో ’జల్సా’ చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లను సాధించిందనేది వారి ఆభిప్రాయం. ప్రస్తుతం ఆ సినిమా ఓవరాల్ వసూళ్లు 50 శాతం కంటే తక్కువగా నమోదవుతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఐపిఎల్ ట్వంటీ 20 మ్యాచ్‌ల సెగ ఆ సినిమాకూ ప్రసరించింది. మార్నింగ్ షో, మ్యాట్నీలు ఫుల్ కాకపోయినా, ఫస్ట్ షో, సెకండ్ షో అయినా ఫుల్ అవ్వాల్సిన స్థితిలో ’జల్సా’ అది సాధించలేకపోతోంది. నాలుగు వారాలకే ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం ఐపిఎల్ ప్రభావమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ’జల్సా’ వంటి భారీ సినిమా పరిస్థితే ఇలా ఉందంటే మిగతా మధ్య స్థాయి, చిన్న సినిమాల సంగతి ఎలా వుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. మే 1న విడుదలైన ’పరుగు’ సంగతి అలా వుంచితే ’మైఖేల్ మదన కామరాజు’, ’భలే దొంగలు’ వంటి సినిమాలకూ ప్రేక్షకులు పలుచనైపోయారు.
Monday, May 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment