ఐటమ్ గర్ల్ స్థాయి నుంచి కథానాయిక స్థాయికి ఎదిగిన ముమైత్‌ఖాన్ ఈ సారి ఒక సాదా సీదా అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. ముమైత్ ప్రధాన పాత్రలో చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలో ఇండియన్ ఫిలిమ్స్ బానర్‌పై పి.శ్రీనివాస్ చౌదరి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంబశివరావు ఇదివరకు ’బ్రహ్మ’ అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి చంద్రమహేష్ క్లాప్‌నివ్వగా కాజా సూర్యనారాయణ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కృష్ణ సాయి, కెమెరా: ప్రభు, మాటలు: వైఎస్. కృష్ణేశ్వరరావు, వరికూటి శివప్రసాద్, నిర్మాత: పి.శ్రీనివాస్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెరుకూరి సాంబశివరావు.
Monday, May 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment